: నాడు మహాత్మా గాంధీ.. నేడు మోదీ: వెంకయ్యనాయుడు

మహాత్మా గాంధీ తర్వాత నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. నోట్ల రద్దుపై విశాఖపట్టణంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. "డెబ్భై ఏళ్లుగా దేశంలో జనం అంతా... పరిస్థితి ఇంతే, ఏం చేస్తాము... మన కర్మ అలా రాసుంది... ఎవరొచ్చినా ఇంతే... ఇది మారదు అనుకుంటూ అవినీతితో ప్రజలు రాజీ పడిపోయారు. కానీ, ఎవరూ ఊహించనే లేదు... ఒకరు వస్తారని, అవినీతి, నల్లధనంపై ఇలాంటి చర్యలు తీసుకుంటారని. మోదీ గారు పెద్ద తిరుగుబాటు దారుడు... రాజీ పడేందుకు సిద్ధపడే వ్యక్తి కాదు. పరిస్థితులతో రాజీ పడకుండా, ఆ పరిస్థితులనే మార్చే వ్యక్తి మోదీ" అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.

More Telugu News