: బాలీవుడ్ గాసిప్స్ కి తాళం వేసిన రణ్ వీర్- దీపిక జంట!

బాలీవుడ్ జంట రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొనే జంట కలిసి కనపడకపోవటంపై వారిద్దరూ దూరంగా ఉంటున్నారనే గాసిప్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేశాయి. ఈ వదంతులు అబద్ధం అంటూ ఈ జంట నిరూపించింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ముంబయిలోని తమ నివాసంలో నిన్న రాత్రి ఏర్పాటు చేసిన ఒక పార్టీకి రణ్ వీర్-దీపిక జంట హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీ ముగిసిన అనంతరం, దీపిక చేయిపట్టుకుని రణ్ వీర్ ఆమెను కారు వద్దకు తీసుకువచ్చాడు. కారులో దీపిక కూర్చున్న తర్వాత రణ్ వీర్ కూర్చున్నాడు. మరో, ఆసక్తికరమైన విషయమేమిటంటే, దీపిక చేతి వేలికి మెరిసిపోతున్న ఒక ఉంగరం ఉండటం. దీంతో, వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

More Telugu News