: రాజ్య‌స‌భ ప్రారంభం.. ‘వీ వాంట్’ అంటూ విపక్ష నేతల నినాదాలు.. సోమ‌వారానికి వాయిదా!

వాయిదా తరువాత తిరిగి ఈ రోజు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభమైన రాజ్యసభలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. స్పీక‌ర్ పోడియం వ‌ద్ద విపక్ష నేతలు 'వీ వాంట్.. వీ వాంట్' అని నినాదాలు చేశారు. అందుకు డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ 'వాట్ డూ యూ వాంట్' (మీకేం కావాలి?) అని ప్ర‌శ్నించారు. స‌భ‌ను స‌జావుగా సాగ‌నివ్వాల‌ని కోరారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ స‌భ్యుల‌ను అవ‌మానించేలా మాట్లాడారని, మోదీ రాజ్య‌స‌భ‌కు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని విప‌క్ష స‌భ్యులు ఛైర్మ‌న్‌ పోడియం వ‌ద్ద‌కు వ‌చ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విప‌క్ష‌నేత‌లు నినాదాలు ఆపకపోవడంతో రాజ్య‌స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు కురియన్ ప్రకటించారు.

More Telugu News