: మోదీని తుగ్లక్ తో పోల్చిన సీపీఎం నేత

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో స్వతంత్ర భారతావనిలో ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. వనరులున్నా డబ్బుల్లేవు. చేతిలోని డబ్బులు చెల్లకుండా పోయాయి. అవసరాలు తీరకుండా పోయాయి. దీంతో ప్రధాని నిర్ణయాన్ని విపక్షాలకు చెందిన నేతలు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న మాట్లాడుతూ, ఇది పిచ్చి తుగ్లక్ నిర్ణయమని విమర్శించారు. తాజాగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని పిచ్చి తుగ్లక్ నిర్ణయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన... మెట్రో నగరాల్లో 20 నుంచి 25 శాతం డబ్బుకు డిమాండ్‌ పెరిగిందని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు తీరక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదేశాలిచ్చిన తుగ్లక్‌ (ప్రధాని మోదీ) మాత్రం కనిపించకుండా పోయారని ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News