: పీఓకే ఏమైనా ఇండియా అబ్బ సొత్తా?... పాక్ కూ వాటా ఉంది: మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాక్ ఆక్రమిత కాశ్మీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే ఏమైనా ఇండియా అబ్బ సొత్తా? (క్యా యే తుమ్హారే బాప్ కా హై?) అని ప్రశ్నించిన ఆయన, పీఓకే పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. చీనాబ్ లోయలో జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమారుడు, మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా పాల్గొన్న ఫారూక్ ఈ వ్యాక్యలు చేశారు. "పీఓకే ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉంది. అదేమీ భారత వ్యక్తిగత ఆస్తి కాదు. తల్లిదండ్రులు, తాతముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి కాదు. ఈ విషయంలో పాకిస్థాన్ కూ వాటా ఉంది. పీఓకే ఇండియాలో భాగమని ఓ తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదు" అని ఆయన అన్నారు. పాక్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ ను వెనక్కు తిరిగి తెచ్చే దమ్ము, ధైర్యం భారత్ కు లేవని అంటూ, ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు తమ పనులు వదిలేసి బ్యాంకుల ముందు వరుస కట్టడం ప్రధాని మోదీ వైఫల్యమేనని ఫరూక్ అన్నారు.

More Telugu News