: మేము సిద్ధంగా లేకపోవడం కాదు... వారికి సమయమివ్వలేదనే బాధ: తనదైన విమర్శలతో నవ్వించిన మోదీ

ఎంతమాత్రమూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పెద్ద నోట్ల రద్దును ప్రకటించారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. రాజ్యాంగంపై రాసిన 'న్యూ వర్షన్ ఆఫ్ కాన్ స్టిట్యూటషన్ ఆఫ్ ఇండియా', 'మేకింగ్ ఆఫ్ కాన్ స్టిట్యూషన్' పుస్తకాలను ఈ ఉదయం ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే విమర్శిస్తున్నారని అన్నారు. "కొంతమంది మేము సిద్ధంగా లేమని, అందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం అది కాదు. నోట్ల రద్దుపై ముందే చెప్పి, వారు సన్నద్ధులై, తమ వద్ద ఉన్న డబ్బును చలామణిలోకి పంపేందుకు సమయం ఇవ్వలేదన్నదే వారి బాధ" అనడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. నల్లధనం, అవినీతిపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఇబ్బందులను మరికొంత కాలం అనుభవించేందుకు ప్రజలు సహృదయంతో సిద్ధంగా ఉండాలని ప్రధాని కోరారు. నల్లధనంపై సామాన్యుడు సైతం సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు.

More Telugu News