: మరింత తగ్గిన క్రూడాయిల్ ధరలు... 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి పతనమైన చమురు కంపెనీల ఈక్విటీ

అంతర్జాతీయ పరిణామాలు క్రూడాయిల్ ధరలు మరింతగా పతనమయ్యేలా చేయగా, ఇండియాలో చమురు కంపెనీల ఈక్విటీలు గణనీయంగా పడిపోయి, నూతన కొనుగోళ్లకు ఆకర్షణీయంగా మారాయి. బీపీసీఎల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ సంస్థలు 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి కిందకు దిగి వచ్చాయి. బీపీసీఎల్ సంస్థ రూ. 694 నుంచి రూ. 639కి, ఐఓసీ రూ. 333 నుంచి రూ. 292కు, హెచ్పీసీఎల్ రూ. 471 నుంచి రూ. 452కు తగ్గాయి. దీంతో ఈ కంపెనీల్లో కొత్త పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక నేటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ సెషన్లో క్రూడాయిల్ భారత బాస్కెట్ ధర (డిసెంబర్ 19 డెలివరీ) క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 39 తగ్గి 1.18 శాతం నష్టంతో రూ. 3,264కు చేరింది. సహజవాయువు ధర 0.78 శాతం తగ్గి రూ. 216కు చేరింది.

More Telugu News