: మరో ఐదు నెలల పాటు నోట్ల కొరత ఉండే అవకాశం

మరో నాలుగు లేదా ఐదు నెలల పాటు దేశంలో నోట్ల కొరత కొనసాగే అవకాశం ఉందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) అంచనా వేసింది. దేశంలోని నాలుగు కరెన్సీ ముద్రణా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ప్రింటింగ్ చేసినా... కొరత ఉంటుందని చెప్పింది. వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తుతాయని... దీంతో, ప్రజల్లో మరింత అసహనం పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఆగ్రహంతో కొందరు బ్యాంకు వినియోగదారులు బ్యాంకులను ధ్వంసం చేశారని... అలాంటి చోట్ల బ్యాంకు కార్యకలాపాలు ఆగిపోయాయని చెప్పింది. ఈ ఏడాది మార్చి నాటికి మన దేశంలో 15,707 మిలియన్ల రూ. 500 నోట్లు... 6,326 మిలియన్ల రూ. 1000 నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది.

More Telugu News