: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం... మళ్లీ అదే సీన్!

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో నేడు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, విపక్ష పార్టీల పార్లమెంటరీ బోర్డులు వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే నోట్ల రద్దుపై చేపట్టనున్న బంద్ గురించి చర్చించారు. అనంతరం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, వాటిపై ప్రతిపక్షాల స్పందన వినేందుకు ఆయన పార్లమెంటుకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో విపక్షాలు తమ ఆందోళనను ప్రారంభించాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ చర్చను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో పోడియంను చుట్టుముట్టిన విపక్షాలు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో నిన్నటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కనిపించిన సన్నివేశాలే ఈ రోజు కూడా కనిపించాయి.

More Telugu News