: మొహాలీ టెస్టుకు ప్రాక్టీస్, వ్యూహాల్లో మునిగిన ఇంగ్లండ్, టీమిండియా

ఈ నెల 26 నుంచి మొహాలీ వేదికగా జరగనున్న మూడో టెస్టు సన్నాహకాల్లో ఇంగ్లండ్, టీమిండియా జట్లు మునిగిపోయాయి. మొహాలీలో పేసర్లకు అనుకూలించే పిచ్ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు హోరాహోరీగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు పేసర్ల ఫార్ములాను రెండు జట్లు అనుసరించనున్నాయి. దీంతో ఒకరిద్దరు పేసర్లు డ్రెస్సింగ్ రూంకి పరిమితం కానున్నారు. మూడో టెస్టు వ్యూహాన్ని ఆటగాళ్లు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. లీడ్ లో ఉన్న టీమిండియాను ఓడించి ఒత్తిడిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రకటించాడు. పిచ్ నుంచి పేస్ కు సహకారం లభిస్తుందని భావిస్తున్నామని, దీంతో టీమిండియా ఆధిక్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నాడు. మరోవైపు కేవలం పేసర్లతోనే బంతులేయించుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీ విజయమే తమ లక్ష్యమంటున్నాడు. జట్టుతో భువనేశ్వర్ కుమార్ చేరడం మరింత బలం పెంచిందంటున్నాడు. ముగ్గురు పేసర్ల వ్యూహం ఫలితమిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. దీంతో మూడో టెస్టుపై ఆసక్తి పెరుగుతోంది.

More Telugu News