: గత పదిరోజుల్లో జీహెచ్ఎంసీ ఆదాయం 242 కోట్లు

పెద్ద నోట్ల రద్దు అనంతరం గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పంటపండింది. పెద్ద నోట్ల రద్దుతో గందరగోళంలో పడిపోయిన జంటనగరాల వాసులకు ఊరటనిచ్చేలా పాత బకాయిలన్నింటికీ పాతనోట్లు స్వీకరిస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించడంతో పన్నులు, బకాయిలు చెల్లించేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు. దీంతో గత పదిరోజుల్లో జీహెచ్‌ఎంసీకి సుమారు 242 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు ప్రకటించారు. అలాగే, వాటర్‌ బోర్డుకు 101.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వారు తెలిపారు. చివరి రోజైన గురువారం జీహెచ్‌ఎంసీకి 22.14 కోట్ల రూపాయల చెల్లింపులు జరగగా, వాటర్‌ బోర్డుకు 3.11 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని అధికారులు వెల్లడించారు. దీంతో గత పదిరోజుల్లో జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయిలో 242 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని వారు ప్రకటించారు.

More Telugu News