: లెక్కల్లో లేని డబ్బు జమ చేసిన వారికి ఇక 'సినిమా చూపిస్తారు' ... 60 శాతం పన్ను విధించే అవకాశం!

పెద్ద నోట్ల రద్దుతో భారీ మొత్తంలో డబ్బు బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో జమ అవుతోంది. పేదలకు చెందిన జన్ ధన్ అకౌంట్లలో కూడా రూ. 21 వేల కోట్లకు పైగా డబ్బు జమ అయింది. ఈ డబ్బు వారి సొంతమా? లేక నల్ల కుబేరులు వేయించారా? అనే విషయం పక్కన పెడితే... లెక్కల్లో లేని డబ్బు జమ చేసిన వారిపై గరిష్టంగా 60 శాతం వరకు పన్ను విధించే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ అత్యవసర భేటీ జరిగింది. ఈ సందర్భంగా, లెక్కల్లో లేని డబ్బు జమ కావడంపై లోతుగా చర్చించినట్టు సమాచారం. జన్ ధన్ ఖాతాలతో పాటు, బినామీ అకౌంట్లపై ప్రత్యేకంగా దృష్టిని సారించడంపై కేబినెట్లో చర్చించారు. అంతేకాదు, దేశీయ బంగారం నిల్వలను పరిమితం చేయడంపై కూడా చర్చ జరిగింది.

More Telugu News