: నాలుగేళ్ల క్రితం మోసం చేసిన పారిపోయిన ప్రియుడు... ఏటీఎం క్యూ లైన్లో దొరికాడు

విధి చాలా విచిత్రమైనది... విధి రాతను ఎవరూ మార్చలేరు అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఓ ఏటీఎం వద్ద డబ్బు డ్రా చేసుకోవడానికి ఓ వ్యక్తి క్యూలైన్లో నిలుచున్నాడు. అంతలోనే అతనికి ఊహించని షాక్ తగిలింది. నాలుగేళ్ల క్రితం అతను ప్రేమించిన యువతి... అతడిని చితగ్గొట్టడమే కాక, పోలీసులకు కూడా పట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. లైన్లో నిలుచున్న తన మాజీ ప్రియుడిని గుర్తుపట్టిన యువతి... లైన్లో నుంచి అతడిని బయటకు లాగి చితగ్గొట్టింది. అంతేకాదు, పోలీసులను అక్కడకు పిలిపించి కటకటాల వెనక్కి నెట్టించింది. నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని... ఆ తర్వాత కనిపించకుండా పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

More Telugu News