: పాక్ దగ్గర ప్రస్తుతం 140 అణుబాంబులు: అమెరికా

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాల్లోని ఆయుధ సామగ్రిపై అంచనాలు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న వివాదాన్ని యుద్ధంగా మార్చేందుకు పాక్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ దగ్గరున్న అణుబాంబుల లెక్కతేలుస్తూ అమెరికా ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 140 అణుబాంబులు ఉన్నాయని, 2025 నాటికి అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో పాక్ మూడో స్థానంలో నిలవనుందని అమెరికా తెలిపింది. 2025 నాటికి పాక్ చేతిలో కేవలం 70 అణుబాంబులు ఉంటాయని గతంలో అంచనా వేసిన అమెరికా ఇప్పుడు ఆ లెక్కను సవరించింది... అప్పటికి పాకిస్థాన్ వద్ద 350 అణుబాంబులు ఉంటాయని తాజాగా తెలిపింది. తమ అంచనాలను తల్లకిందులు చేస్తూ... భారత్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ భారీ ఎత్తున అణ్వాయుధాలు సమకూర్చుకుందని అమెరికా తెలిపింది. భారత్ కూడా దీటుగా అణ్వాయుధాలు సమకూర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించిందని అమెరికా పేర్కొంది.

More Telugu News