: ముగిసిన కేబినెట్ భేటీ... కొత్త నిర్ణయాలు!

పార్లమెంటు లైబ్రరీహాల్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. అందుబాటులో ఉన్న మంత్రులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపిన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి వివిధ లావాదేవీల్లో 500, 1000 రూపాయల చెల్లుబాటు గడువు ముగియడంతో డిసెంబర్ 2 వరకు టోల్ రుసుం రద్దును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే 500, 1000 రూపాయల నోట్లు డిసెంబర్ 15 వరకు ఆసుపత్రులు, మెడికల్ షాప్స్, పెట్రోల్ పంపుల వద్ద పనిచేస్తాయని తెలిపారు. రైల్వే టికెట్లు తీసుకునేందుకు కూడా పాత నోట్లను వినియోగించవచ్చు. అలాగే నవంబర్ 8 తరువాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తాలపై పన్ను విధించేందుకు చట్టసవరణకు కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

More Telugu News