: లోక్‌స‌భ‌లో స్పీకర్‌ సుమిత్రా మహాజన్ పై పేప‌ర్లు చింపి విసిరేసిన ఎంపీ

పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్ష నేత‌ల ఆందోళ‌నతో ఈ రోజు లోక్‌స‌భలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. పెద్దనోట్లు రద్దుతో ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేప‌థ్యంలో సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ అక్షయ్‌ యాదవ్‌ కాగితాలు చింపి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పై విసిరేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార ప‌క్ష నేత‌లు వారి ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. దీంతో లోక్‌ సభను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీకర్ సుమిత్రా మ‌హాజ‌న్ పేర్కొన్నారు. స్పీకర్‌ పై కాగితాలు విసిరిన ఎంపీపై కేంద్ర స‌ర్కారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇటువంటి చ‌ర్య‌కు పాల్ప‌డిన అక్ష‌య్‌యాద‌వ్‌పై చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. లోక్‌స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం ఇదే అంశంపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంత్‌ కుమార్ లు భేటీ అయ్యారు. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ స‌భ‌లో ఎంపీ చ‌ర్య స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

More Telugu News