: ట్రంప్ గెలిచిన చోట్ల హ్యాకింగ్... సాక్ష్యాలున్నాయని చెబుతున్న డేటా సైంటిస్టులు

ఓట్లను హ్యాక్ చేయడం ద్వారా ట్రంప్ విజయం సాధించారా? స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, విస్కాన్సిస్, పెన్సిల్వేనియాల్లో హ్యాకింగ్ జరిగిందా? అంతే అవునని అంటున్నారు అమెరికా డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు. ఈ మేరకు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ హిల్లరీ గెలిచివుంటే అధ్యక్షురాలిగా ఆమే ఎన్నికై ఉండేవారు. ట్రంప్ తో పోలిస్తే 20 లక్షలకు పైగా అధికంగా ఓట్లను తెచ్చుకున్నప్పటికీ, హిల్లరీ క్లింటన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ ఓట్లను ఆమె పొందడంలో విఫలం అయ్యారు. కాగా, ఈ తాజా సైంటిస్టుల ప్రకటన అమెరికాలో కలకలం రేపుతోంది. వీరిచ్చే ఆధారాలతో రీకౌంటింగ్ జరపాలని గ్రీన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో పోటీ పడ్డ జిల్ స్టెయిన్ డిమాండ్ చేశారు. దీని కోసం ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ పేజీ ప్రారంభించగా, ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు పోగయ్యాయి కూడా. ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే హ్యాకింగ్ పై విచారణ జరపాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. బ్యాలెట్ పేపర్ల బదులు ఓటింగ్ మెషీన్లు వాడటం వల్లనే రిగ్గింగ్ జరిగిందని నిపుణులు అంటున్నారు. రీకౌంటింగ్ కు బుధవారం వరకూ మాత్రమే అవకాశం ఉండటంతో, న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని స్వింగ్ రాష్ట్రాల్లోని డెమోక్రాట్ నేతలు అంటున్నారు.

More Telugu News