: విపక్షాలను చర్చలకు ఆహ్వానించిన రాజ్ నాథ్... ససేమిరా కుదరదన్న అఖిలపక్షం

నోట్ల రద్దు అంశం పార్లమెంట్ ను నిత్యమూ స్తంభింపజేస్తున్న వేళ, పరిస్థితులను సద్దుమణిగేలా చూసేందుకు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగి, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలను చర్చలకు ఆహ్వానించగా, తమ డిమాండ్లను అంగీకరించే వరకూ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్, తృణమూల్, ఆప్ తదితర పార్టీలు స్పష్టం చేశాయి. ఈ ఉదయం గులాంనబీ ఆజాద్ నేతృత్వంలో ఆఖిలపక్ష భేటీ జరుగగా, నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో క్యూలైన్లలో మరణించిన వారికి పార్లమెంటులో నివాళులు అర్పించాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా ప్రజలను ఇబ్బందులు పెట్టినందుకు మోదీ క్షమాపణలు చెప్పాలని, ఇందుకు బాధ్యులను శిక్షించాలని ఇప్పటికే పలు పార్టీలు పార్లమెంట్ లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News