: ఐరాస రాయబారిగా భారత సంతతి నిక్కీ హేలీ.. విద్యామంత్రిగా బెస్టీ డేవాస్.. డొనాల్డ్ ట్రంప్ నియామకాలు

భారత సంతతికి చెందిన సౌత్ కాలిఫోర్నియా గవర్నర్ నిక్కీ హేలీకి ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరఫున అంబాసిడర్ బాధ్యతలను ఆఫర్ చేశారు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా నుంచి వలస వెళ్లిన దంపతుల పుత్రికగా, సౌత్ కాలిఫోర్నియాకు ఎన్నికైన తొలి మహిళా గవర్నర్ గా 44 సంవత్సరాల హేలీ, తొలుత ట్రంప్ వ్యతిరేకులకే మద్దతుగా నిలిచారు. ఇక హేలీ నేపథ్యం, ఆమె రాజకీయ అనుభవానికి ముగ్ధుడైన ట్రంప్, ఆమెను క్యాబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ విజయం తరువాత హేలీ ఆయన్ను కలిశారని, ఆ సందర్భంగా ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారని ట్రంప్ ప్రతినిధి జాసన్ మిల్లర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ అధికార బదలాయింపునకు సంబంధించిన పనులను శరవేగంగా జరుపుతున్నారని తెలిపారు. ఇక వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్న బెస్టీ డేవాస్ ను విద్యాశాఖ మంత్రిగా నియమించాలని భావిస్తున్న ట్రంప్, ఈ మేరకు బెస్టీకి కూడా ఆఫర్ ఇచ్చారు. దశాబ్దాల నుంచి రిపబ్లికన్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న 58 సంవత్సరాల డేవోస్, మిచిగాన్ లో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అమెరికన్ ఫెడరేషన్ ఫర్ చిల్డ్రన్ కు చైర్ ఉమెన్ గా పనిచేశారు. మాజీ ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ వ్యవస్థాపకుడిగా ఉన్న విద్యా బోర్డులో డైరెక్టర్ గా ఉన్నారు. డెవోస్ సైతం ట్రంప్, నూతన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు.

More Telugu News