: శాంసంగ్ సంస్థపై అవినీతి ఆరోపణలు.. న్యాయవాదుల రైడ్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ ఉత్ప‌త్తి సంస్థ శాంసంగ్‌పై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న ఆ దేశ‌ న్యాయ‌వాదులు ఈ రోజు ఆ సంస్థ‌ ప్ర‌ధాన కార్యాల‌యంపై రైడ్‌ చేశారు. సియోల్ కేంద్ర జిల్లా న్యాయవాదుల ఆఫీసు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ ఈ దాడి చేసింద‌ని అక్క‌డి మీడియా తెలిపింది. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ హైతో క‌లిసి ఆమె చిరకాల మిత్రురాలు చోయి సూన్ సిల్ నిర్వ‌హించే నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్లకు శాంసంగ్ అధికారులు మిలయన్ల కొద్దీ అమెరికా డాలర్లను తరలించినట్టు వారు ఆరోపిస్తున్నారు. అంతేగాక‌, శాంసంగ్ వైర్ 2.8 మిలియన్ల యూరోలను జర్మన్ లోని చోయి సూన్ సిల్ నిర్వ‌హించే ఓ సంస్థ‌కు తరలించినట్టు, తన రెండు సబ్సిడరీల విలీనానికి కంపెనీ మద్దతుగా నిలిచినట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

More Telugu News