: 'త్రినేత్రం'ను తెరవనున్న రైల్వే శాఖ!

ఇండియాలో రైలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేలా రైల్వే శాఖ తన 'త్రినేత్రం'ను తెరవనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన 'ట్రై-నేత్ర'ను రైళ్లలో వాడటం ద్వారా, ట్రాక్ నిర్వహణ రికార్డులను నిర్వహించవచ్చని, పొగ మంచుకురిసే సమయాల్లో మరింత విజబిలిటీని ఈ వ్యవస్థ అందిస్తుందని హై రెజల్యూషన్ ఆప్టికల్ వీడియో కమెరా, హై సెన్సిటివిటీ ఇన్ ఫ్రా వీడియో, రాడార్ ఆధారిత మ్యాపింగ్ సిస్టమ్స్ సాయంతో ఈ త్రినేత్రం పని చేస్తుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రై-నేత్ర (Tri-Netra) అంటే "టెర్రెయిన్ ఇమేజింగ్ ఫర్ డీజిల్ డ్రైవర్స్ ఇన్ ఫ్రారెడ్, ఎన్ హ్యాన్డ్స్, ఆప్టికల్ అండ్ రాడార్ అసిస్టెడ్ సిస్టమ్". ఈ వ్యవస్థ రైలు డ్రైవర్ కు ఒక కిలోమీటరు దూరంలోని ట్రాక్ ను కూడా స్పష్టంగా చూపుతుంది. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకున్నా, వేగంగా రైళ్లు ప్రయాణించేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, మంచి ఫలితాలు వస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు అంటున్నారు.

More Telugu News