: మ‌రింత వెసులుబాటు... ఫీచ‌ర్ ఫోన్ల ద్వారా డిజిట‌ల్ లావాదేవీల‌పై సేవా రుసుం ఎత్తివేత

దేశంలో సెల్ ఫోన్ వినియోగదారులు 65 శాతానికి పైగా ఫీచ‌ర్ ఫోన్ల‌నే వాడుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత దాస్ తెలిపారు. ఫీచ‌ర్ ఫోన్ల ద్వారా డిజిట‌ల్ లావాదేవీల‌పై సేవా రుసుం ఎత్తివేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా తాము తీసుకున్న నిర్ణ‌యాల గురించి వివ‌రించారు. రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా డిజిట‌ల్ లావా దేవీల ప్రోత్సాహానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కొత్త‌ రూ.2000 నోట్లు స‌హా అన్ని నోట్ల‌ను విత్ డ్రా చేసుకునేందుకు ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 82,000 ఏటీఎం కేంద్రాల‌ను రీ కాలిబ‌రేట్ చేసిన‌ట్లు శ‌క్తికాంత దాస్ తెలిపారు. మ‌రికొన్ని రోజుల్లోనే దేశంలో ఏటీఎంల సామ‌ర్థ్యాన్ని పెంచుతామ‌ని తెలిపారు. పూర్తి స్థాయిలో ఏటీఎం సేవ‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని చెప్పారు. నాబార్డ్‌, ఆర్‌బీఐ అధికారుల‌తో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరుణ్‌జైట్లీ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారని ఆయన తెలిపారు.

More Telugu News