: పాక్ ఆర్మీ చీఫ్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్?

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ పదవినీ భర్తీ చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభం అయ్యాయి. ఆ పదవికి సరిపోయే నలుగురు లెఫ్టినెంట్ అధికారుల పేర్లను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆర్మీ అధికారులు అందజేసినట్టు సమాచారం. ఆ నలుగురిలో లెఫ్టినెంట్ జనరల్ జావేద్ ఇక్బాల్ రమడే, లెఫ్టినెంట్ జనరల్ జుబేర్ హయత్, లెఫ్టినెంట్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్, లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఉన్నారు. ఈ క్రమంలో, పాక్ ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్ ను ఎంపిక చేస్తారని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ‘డాన్’ పత్రిక కథనం ప్రకారం, ‘పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్ ఎవరనే విషయం ప్రధాని నవాజ్ షరీఫ్ కు మాత్రమే తెలుసని, ఆ వ్యక్తే లెఫ్టినెంట్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్ అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ముల్తాన్ కార్ప్స్ కమాండర్ గా వ్యవహరిస్తున్న ఇష్ఫాక్ నదీమ్ కాబోయే పాక్ ఆర్మీ చీఫ్’ అని పేర్కొంది.

More Telugu News