: హీరోయిన్లను ముట్టుకోకుండానే రొమాన్స్ పండించొచ్చు: వెంకయ్య నాయుడు

ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సినీరంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయిందని... ఇలాంటివి సమాజంపై ప్రభావాన్ని చూపిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అశ్లీలతలు లేకుండా... భావోద్వేగాలతో మంచి సినిమాలు తీస్తే, సమాజానికి మంచిదని సూచించారు. సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని చెప్పారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించవద్దని దర్శక నిర్మాతలను కోరారు. హీరోయిన్లను ముట్టుకోకుండానే రొమాన్స్ ను అద్భుతంగా పండిచవచ్చని వెంకయ్య తెలిపారు. పెదవులు, కళ్లు, ముక్కు, చూపులతో కూడా రొమాన్స్ ను పండించవచ్చని చెప్పారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, నో వన్ కిల్డ్ జెస్సికా, పీకే, ఓ లక్కీ లక్కీ ఓయే సినిమాలు తన అభిమాన సినిమాలని తెలిపారు.

More Telugu News