: మోదీకి సలాం చేస్తున్నానన్న లెజెండరీ యాక్టర్

పెద్ద నోట్ల రద్దు చాలా మంచి నిర్ణయమని... నల్లధనంపై ఇదొక మెరుపు దాడిలాంటిదని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని అభినందిస్తున్నానని, ఆయనకు సలాం చేస్తున్నానని చెప్పారు. ప్రధాని మోదీ ఏదైతే చెప్పారో, అదే చేస్తున్నారని కితాబిచ్చారు. నోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నా, భవిష్యత్తులో మంచే జరుగుతుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ప్రధాని స్థాయి నేతలెవరైనా సరే... కీలక నిర్ణయాలను అవివేకంతో తీసుకోరన్న సంగతిని అందరం గుర్తుంచుకోవాలని సూచించారు. తాను వ్యక్తి పూజ చేయనని... నిజాయతీతో ఎవరు, ఏ నిర్ణయం తీసుకున్నా ఆదరిస్తానని తెలిపారు. సినిమా థియేటర్లు, మద్యం షాపుల వద్ద మనం క్యూలో నిలబడుతుంటాం... మరి, ఒక మంచి పని కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలబడలేమా? అని ప్రశ్నించారు. ఈ విషయాలను ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్ లో ఉన్నారు.

More Telugu News