: నాలుగు అంగుళాల జాడీ... వారి జీవితాలనే మార్చేసింది!

ఓ మధ్య తరగతి కుటుంబీకులను నాలుగు అంగుళాల జాడీ సంపన్నులుగా మార్చేసింది. వివరాల్లోకి వెళ్తే, నార్త్ ఇంగ్లండ్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఇటీవలి వరదల కారణంగా వారి ఇళ్లు దెబ్బతినడంతో... ఇంట్లోని కొన్ని సామాన్లు అమ్మేసి, ఇంటికి మరమ్మత్తులు చేయించుకుందామని ఆ కుటుంబసభ్యులు భావించారు. దీంతో, ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ బయటకు తీశారు. వాటిలో నాలుగు అంగుళాలు ఉన్న ఓ జాడీ బయటపడింది. తన తండ్రి 1946లో లండన్ వెళ్లినప్పుడు 9 పౌండ్లు పెట్టి కొన్న జాడీ ఇది అని ఇంటి యజమాని గుర్తు చేసుకున్నాడు. పాత వస్తువు కావడంతో ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో పురాతన వస్తువులు అమ్మే షాపుకు దాన్ని తీసుకెళ్లాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన షాపు ఓనర్... ఇది చాలా అరుదైనదని చెప్పాడు. అంతేకాదు, ఓ నిపుణుడిని పిలిపించి అతని చేత పరీక్షింపజేశాడు. దీంతో, దాని అసలు కథేంటో బయటకు వచ్చింది. 300 ఏళ్ల క్రితం దాన్ని తయారు చేశారు. క్వింగ్ చక్రవర్తి యాంగ్ జెంగ్ కోసం దాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రపంచంలో ఇలాంటివి కేవలం మూడే ఉన్నాయి. ఒకటి లండన్ లోని విక్టోరియా మ్యూజియంలో ఉండగా, రెండోది అల్బర్ట్ మ్యూజియంలో ఉన్నట్టు నిపుణుడు తెలిపాడు. దీని విలువ రూ. 8 నుంచి 16 కోట్ల మధ్యలో ఉంటుందని అతను అంచనా వేశాడు. ఈ క్రమంలో, ఆ జాడీకి వేలం నిర్వహించగా రూ. 8.43 కోట్లకి అమ్ముడు పోయింది. దీంతో, ఆ మధ్య తరగతి కుటుంబీకులు ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు.

More Telugu News