: టూ పీస్ బికినీ ధరించినప్పుడు నా తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు: యువరాజ్ సింగ్ మరదలు

తాను పుట్టిందే బాలీవుడ్ లో వెలిగిపోవడానికని యువరాజ్ సింగ్ మరదలు, టాప్ మోడల్ ఆకాంక్ష శర్మ తెలిపింది. ఇతర మోడల్స్ లా తాను ఏజన్సీల చుట్టూ తిరగలేదని... ఫేస్ బుక్ లో తన ప్రొఫైల్ చూసి 'ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్' నిర్వాహకులే తనను సంప్రదించారని చెప్పింది. బికినీల్లో కనపడటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది ఈ అమ్మడు. టూ పీస్ బికినీల్లో షూటింగ్ చేసినప్పుడు తన తల్లిదండ్రులు తనతోనే ఉన్నారని, ఆ దుస్తులు ధరించడం పట్ల వారు అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపింది. మోడల్ గా ఎదగడానికి తన తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తున్నారని చెప్పింది. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఆకాంక్ష తన ప్రతిభ చాటుకుంది. బిగ్ బాస్ షోలో ఆకాంక్ష మాట్లాడుతూ, క్రికెటర్ యువరాజ్ సింగ్ సోదరుడు జొరావర్ తో తన పెళ్లి పెటాకులు కావడానికి అతని తల్లే కారణమని మరోసారి ఆరోపించింది. అతనితో విడిపోయిన తర్వాత తనకు నెలకు కేవలం రూ. 3000ల భరణం మాత్రమే ఇస్తున్నారని విమర్శించింది. అయితే, ఆకాంక్ష ఆరోపణలను కొట్టిపారేస్తూ... యువరాజ్ తల్లి షబ్నం ఏకంగా కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తన తొలి పెళ్లి ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన ప్లాన్స్ మొత్తం మోడలింగ్, బాలీవుడ్ చుట్టే తిరుగుతున్నాయని తెలిపింది.

More Telugu News