: రైలు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్చలు తీసుకుంటాం: సురేష్ ప్రభు

పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. ప్రమాదంపై విచారణ జరుపుతామని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు ప్రమాదంలో పలువులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలంటూ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఈ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లో పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి.

More Telugu News