: యునైటెడ్ స్టేట్స్.. ఇక డివైడెడ్ స్టేట్స్?.. విడిపోవ‌డ‌మే మేలంటున్న చాలా రాష్ట్రాలు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. యూఎస్ఏ. ప్ర‌పంచ పెద్ద‌న్న‌గా మ‌న్న‌న‌లు అందుకుంటున్న అమెరికా ముక్క‌లు కాక త‌ప్ప‌దా? అంటే, అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితికి, ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమెరికా అధ్య‌క్షుడిగా రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చాలా రాష్ట్రాల ప్ర‌జ‌లు ట్రంప్‌ను అధ్య‌క్షుడిగా అంగీక‌రించేది లేద‌ని తెగేసి చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా కాలిఫోర్నియా, ఓరెగాన్‌, వాషింగ్ట‌న్‌, నెవ‌డాలో ట్రంప్ వ్య‌తిరేకత ఎక్కువ‌గా ఉంది. తాము అమెరికా నుంచి వేరుప‌డ‌తామంటూ ఈ రాష్ట్రాలు బాహాటంగానే చెబుతున్నాయి. అమెరికా నుంచి వేరుప‌డి భావ‌సారూప్య‌త ఉన్న రాష్ట్రాల‌తో క‌లిసి కొత్త దేశంగా అవ‌త‌రించాల‌ని, లేదంటే పొరుగునే ఉన్న కెన‌డాతో క‌ల‌వాల‌ని భావిస్తున్నాయి. మ‌రోవైపు అధ్య‌క్షుడిగా కోరుకోని వ్య‌క్తి ఎన్నిక‌వ‌డంతో త‌ట్టుకోలేక‌పోతున్న ప‌శ్చిమ తీర ప్రాంతాలైన ఆ నాలుగు రాష్ట్రాలు త‌మ‌తో క‌ల‌వాలంటూ ప‌క్క‌నే ఉన్న కెన‌డియ‌న్లు సోష‌ల్ మీడియా ద్వారా అసంతృప్తితో ఉన్న అమెరిక‌న్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ఈ ప్ర‌చారం వైర‌ల్ అయింది. ఒక‌ప్పుడు కాలిఫోర్నియా మెక్సికోలో భాగంగా ఉండేది. అమెరికా, మెక్సికో మ‌ధ్య యుద్ధం జ‌రిగిన‌ప్పుడు కాలిఫోర్నియాలోని అమెరికా సెటిల‌ర్లు ఆ రాష్ట్రాన్ని స్వ‌తంత్ర రాష్ట్రంగా ప్ర‌క‌టించుకున్నారు. కానీ అమెరికా ఆ రాష్ట్రంలో తన జెండా ఎగుర‌వేసి అమెరికాలో భాగంగా ప్ర‌క‌టించింది. కాగా తాజాగా ముగిసిన ఎన్నిక‌ల‌కు ముందు ట్రంప్ గెలుపు త‌థ్య‌మ‌న్న స‌ర్వేల‌తో కాలిఫోర్నియాలో అల‌జ‌డి మొద‌లైంది. ట్రంప్ అధ్య‌క్ష‌త‌ను త‌ప్పించుకునేందుకు అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోవాల్సిందేన‌ని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హైప‌ర్ లూప్ వ‌న్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు పెర్విన్ పిపివేర్ ప్ర‌తిపాదించారు. ఈయూ నుంచి బ్రిట‌న్ వైదొలిగిన‌ట్టు (బ్రెగ్జిట్) అమెరికా నుంచి కాలిఫోర్నియా కూడా విడిపోవాలంటూ 'కాల్ ఎగ్జిట్' పేరుతో 25 పేజీల ప‌త్రాన్ని రూపొందించారు. అయ‌న‌కు ఎంద‌రో ప్ర‌ముఖులు మ‌ద్దతు తెలిపారు. ఆయ‌న బాట‌లోనే ప‌శ్చిమ తీర రాష్ట్రాలు త‌మ గ‌ళాన్ని పెంచాయి. అమెరికా నుంచి విడిపోతేనే మేల‌న్న అభిప్రాయానికి వ‌చ్చాయి. ఓరెగాన్‌, వాషింగ్ట‌న్‌, నెవ‌డా కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాయి. దీంతో ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదే చ‌ర్చ మొద‌లైంది. సంయుక్త రాష్ట్రాల‌తో ప్ర‌పంచంలోనే బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదిగిన అమెరికా ఇప్పుడు ముక్క‌లు చెక్క‌లయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వేర్పాటు ఎంత‌వ‌ర‌కు సాధ్య‌మ‌నే ప్ర‌శ్న ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి మెద‌ళ్ల‌ను తొలిచేస్తోంది.

More Telugu News