: టీవీ షూటింగ్ లో బిగుసుకున్న ఉరితాడు... కట్ చెప్పని డైరెక్టర్.. కాపాడిన యూనిట్!

ప్రిన్స్ నరుల... టీవీ తెరపై రాణిస్తున్న నటుడు. బిగ్ బాస్ షో విన్నర్ కూడా. ఓ షో కోసం ప్రిన్స్ ఉరివేసుకుంటున్న దృశ్యం చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకున్న ఉరి దాదాపు ఆయన ప్రాణాలను తీసినంత పని చేసింది. కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో ప్రిన్స్ మెడకు ఉరి బిగుసుకుంది. డైరెక్టర్ కట్ చెప్పలేదు. ఆపై తాడు బిగుసుకుని కేకలు పెడుతున్న ప్రిన్స్ ను యూనిట్ సిబ్బంది పరుగున వెళ్లి కాపాడారు. మెడ చుట్టూ స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో చాలా భయపడ్డానని చెప్పాడు. ఈ సీన్ అభిమానులకు థ్రిల్ కలిగిస్తుందని అన్నాడు.

More Telugu News