: డిపాజిట్ గీత దాటింది... ఐటీ అటాక్ మొదలైంది!

నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తరువాత ఏ ఖాతాలోనైనా రూ. 2.5 లక్షల కన్నా అధికంగా నగదు డిపాజిట్ చేస్తే, ఆయా ఖాతాలను పరిశీలించి నోటీసులు పంపిస్తామని హెచ్చరికలు చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అన్నంతపనీ మొదలు పెట్టింది. ఓ కంపెనీ జమచేసిన డబ్బుపై లెక్కలను చెప్పాలని ఆదేశించింది. సిక్కింలో పనిచేస్తున్న సీతారామా ఎంటర్ ప్రైజస్ సంస్థ నవంబర్ 13న తన ఖాతాలో రూ. 4.51 లక్షలను జమ చేసుకుంది. దీన్ని గమనించిన ఐటీ శాఖ నవంబర్ 12 నుంచి 14 మధ్య జరిగిన అన్ని లావాదేవీల వివరాలనూ వెల్లడించాలని ఆదేశించింది. ఈ డబ్బుకు ఆదాయపు పన్ను చెల్లించివుంటే, దాని నఖలును సమర్పించాలని సూచించింది. ఇదిలావుండగా, గతంలో పెద్దమొత్తంలో నగదు డిపాజిట్లు లేకుండా, నోట్ల రద్దు తరువాత భారీగా డిపాజిట్లు వచ్చి పడుతున్న ఖాతాలపైనా ఐటీ శాఖ ప్రత్యేక దృష్టిని సారించింది.

More Telugu News