: థాంక్స్ గివింగ్ సందర్భంలో రాలెలో దక్షిణ భారత రుచుల ధరణి రెస్టారెంటు ఆరంభం

యూఎస్ఏ, నార్త్ కరోలినా, Nov 18th 2016 (Press Note): నార్త్ కరోలినా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా ఇప్పుడు పసందైన దేశీయ వంటకాల చిరునామా, ఈ నెల 19న ప్రారంభం. ఆల్టామౌంట్ గ్రూపు వారి సరికొత్త ధరణి రెస్టారెంట్ ఈ నెల 19న రాలేలోని నార్త్ కరోలినా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా అట్టహాసంగా ప్రారంభం కానుంది. నార్త్ కరోలినా రాష్ట్రంలో ఇది గ్రూపు యొక్క రెండవ రెస్టారెంట్.

దక్షిణ భారత వైవిధ్య రుచులను అందించటంలో అమెరికా వ్యాప్తంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ధరణి రెస్టారెంట్, విశేష రుచులే కాక మనం ఎంతో ఉత్సాహంగా ఆరగించే రోజు వారీ ఫలహారాలు, చిరు తిళ్ళు కూడా అందిస్తోంది. "విశేషమైన మరియు విభిన్నమైన జీవన శైలి కలిగి ఉన్నందువల్ల మేము నార్త్ కరోలినా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా మా రెస్టారెంట్ నెలకొల్పాము. అధిక జనాభా ఉన్న ఈ ప్రాంత వాసులు చక్కటి దేశీయ విందు ఆరగించటానికి ఉత్సాహపడుతున్నారు. వీరిని అలరించటానికి మేము ఆకర్షణీయమైన మెనూతో సిద్ధంగా ఉన్నాము," అన్నారు నార్త్ కరోలినా ధరణి మేనేజింగ్ పార్టనర్ సిహెచ్ సురేష్.

100 సీట్లతో రాలేలోని వాణిజ్య ప్రాంతంలో ఉండే ధరణి దక్షిణ భారతీయ రుచుల వైవిధ్యాన్ని, విశేషాలను భోజన ప్రియులకు అందిస్తుంది. ధరణి యొక్క కొన్ని ప్రత్యేక వంటకాలలో నావాబి కోఫ్తా, పెసరట్టు కుర్మా, చెట్టినాడు వంటకాలు, ఎన్నైకత్రికాయి, పుండు కొళంబు, వంజరం వేపుడు, కోడి ఇగురు, అరటికాయ బజ్జి మొదలగునవి.

చక్కటి కళాత్మకమైన ఉన్నతమైన వాతావరణం అందించే ధరణి రెస్టారెంట్ వారాంతంలో వీకెండ్ బఫెట్ ను థాంక్స్ గివింగ్ వారాంతంగా ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ప్రత్యేక రోజుని ఆనందంగా బంధుమిత్రులతో జరుపుకోవటానికి దేశవ్యాప్తంగా అన్ని ధరణి రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆల్టామౌంట్ రెస్టారెంట్ గ్రూపు అధినేత భాస్కర్ రెడ్నం ఇలా అన్నారు, "మా గ్రూపు విస్తరణ మెరుపు వేగంతో జరుగుతోంది, అలాగే ఆదరణ కూడా అంతే వేగంగా మేము సంపాదిస్తున్నాము. లతాం న్యూయార్క్, వీఏ, ఎంఏ మరియు టెక్సాస్ లలో విస్తరించబోతున్నాము. అలాగే మా గ్రూపు రెస్టారెంట్లు కేవలం రుచులలోనే కాకుండా, అతిథులను అలరించటానికి కళాత్మకమైన అందమైన వాతావరణం కూడా సొంతం చేసుకున్నాయి".

ఆల్టామౌంట్ గ్రూపు యొక్క ఇతర రెస్టారెంట్లు ధరణి ఎక్స్ ప్రెస్, మావా హౌస్, ధరణి-గాలక్సీ మొదలగునవి.
 
ధరణి ఎక్స్ ప్రెస్:
3281 అవెంట్ ఫెర్రీ రోడ్,
సూట్ 117,
రాలే, నార్త్ కరోలినా 27606
 

మరిన్ని వివరాలకు:
సురేష్ సిహెచ్
ఫోన్: 919-821-7991
INFO@DHARANIUS.COM
WWW.DharaniUS.COM

 Press note released by: Indian Clicks, LLC

More Telugu News