: ‘ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపో’.. ట్రంప్‌ మద్దతుదారుల నుంచి ఇండో-అమెరికన్ మహిళకు బెదిరింపులు

ఇటీవ‌లే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో హిల్లరీ క్లింట‌న్‌పై విజ‌యం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌ని చూస్తోన్న ఇండో-అమెరికన్‌ మహిళకు బెదిరింపులు వ‌చ్చాయి. ట్రంప్ ఆ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌య‌ఢంకా మోగించిన అనంత‌రం ఈ నెల 9న ఏర్పాటు చేసిన‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సియాటెల్‌ కౌన్సిల్ మ‌హిళ, సోషలిస్టు క్షమా సావంత్ మాట్లాడుతూ... వ‌చ్చే ఏడాది జనవరిలో ట్రంప్‌ ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో ఆందోళ‌న నిర్వ‌హిద్దామ‌ని, జాత్యహంకారం ఉన్న‌ వ్యక్తులను అమెరికా అంగీకరించ‌ద‌ని తెలియ‌జేస్తూ అదే నెల 20, 21 వ‌ తేదీల్లో అమెరికా వ్యాప్తంగా సమ్మె జరుపుదామ‌ని పిలుపునిచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రాంతంలోకి ప్ర‌వేశిద్దామ‌ని వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాట్లాడుతుండ‌గా తీసిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆమెను బెదిరిస్తూ ఫొన్‌కాల్స్‌, ఈ మెయిల్స్‌ వచ్చాయి. ఆమె త‌న స్వ‌స్థలానికి వెళ్లిపోవాలని, ఆమె నుదిటిపై స్వ‌స్తిక్ గుర్తును టాటూగా వేస్తామ‌ని అన్నారు. ఒబామా అధ్య‌క్ష ప‌దవి చేప‌ట్టిన‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌ని మీరు, ఇప్పుడు తెల్ల‌వాడ‌యిన ట్రంప్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తుంటే రేసిస్ట్ అంటున్నారెందుకు? అని అడిగారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించిన అనంత‌రం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నారు.

More Telugu News