: 70 కోట్ల స్మార్ట్ ఫోన్లలో చైనా సాఫ్ట్ వేర్... మెసేజ్ ల నుంచి కాంటాక్టు నంబర్ల వరకూ బీజింగ్ సర్వర్లకు చేరవేత!

తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువ ఫీచర్లున్న చైనా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారా? మీ సమాచారం చైనా సర్వర్లకు చేరిపోయి ఉండవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'బ్లూ' కంపెనీ విక్రయించిన బడ్జెట్ ఫోన్ల నుంచి వెళుతున్న మెసేజ్ లు చైనాలోని రహస్య సర్వర్ కు చేరుతున్నాయని 'క్రిప్టోవైర్' అనే సెక్యూరిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఫోన్లో ఇన్ స్టాల్ అయిన అనుమానాస్పద సాఫ్ట్ వేర్, కస్టమర్లకు తెలియకుండా షాంగైలోని సర్వర్లకు వినియోగదారుల లొకేషన్, కాల్ లిస్టు, కాంటాక్టులకు ప్రతి 72 గంటలకు పంపుతోందని తెలిపారు. అయితే, ఈ సమాచారం చైనా ప్రభుత్వానికి చేరుతోందా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాగా, కాగా, ఈ మాల్ వేర్ ను షాంగైలోని 'అడుప్స్ టెక్నాలజీ' అనే కంపెనీ తయారు చేసిందని, దాదాపు 70 కోట్ల ఫోన్లలో ఈ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అయిందని, అమెరికాలో 1.2 లక్షల ఫోన్లలో ఈ సాఫ్ట్ వేర్ ఉందని 'క్రిప్టోవైర్' పేర్కొంది. ఈ విషయంపై స్పందిస్తూ, తమ ఫోన్లలోని అనుమానాస్పద సాఫ్ట్ వేర్ ను తొలగిస్తున్నట్టు బ్లూ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

More Telugu News