: జేపీ మోర్గాన్ కు రూ. 1784 కోట్ల జరిమానా!

చైనాలో వ్యాపారం పెంచుకునేందుకు ఆ దేశంలోని ఉన్నతాధికారుల పిల్లలకు సీనియర్ పోస్టులను అప్పగించిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ జేపీ మోర్గాన్ పై భారీ జరిమానా పడనుంది. ఉద్యోగాలను ఎర చూపడం కూడా లంచం ఇవ్వడంతో సమానమేనని భావించిన అమెరికాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్, మొత్తం ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ తో కలసి విచారణ జరిపించి జేపీ మోర్గాన్ ది తప్పేనని తేల్చింది. దీంతో సంస్థపై రూ. 1784 కోట్ల జరిమానా విధించే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఎక్స్ఛేంజ్ కమిషన్ కు రూ. 882 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు యూఎస్ జస్టిస్‌ డిపార్ట్‌ మెంట్‌ కు రూ. 488 కోట్లు, ఫెడరల్‌ రిజర్వుకు రూ. 414 కోట్లు చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు.

More Telugu News