: సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో పాతనోట్ల మార్పిడి కేంద్రం

రద్దయిన పెద్దనోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఖాతాదారులు ‘క్యూ’ కడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, వైద్య సేవల నిమిత్తం నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చే వారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) ఆర్పీ రోడ్ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది సహాయార్థం తమ బ్రాంచ్ తరపున నోట్ల మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఓబీ రీజినల్ మేనేజర్ పద్మాకర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ఉన్న రోగుల సహాయకులు, ఉద్యోగుల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించామని, డిసెంబరు 31 వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. కాగా, పాతనోట్లను మార్చుకునేందుకు గాను, రోగుల సహాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, నర్సులు క్యూ కట్టారు.

More Telugu News