: 1,03,733 రూపాయల ధర పలికిన చేప!

సాధారణంగా కేజీ చేపలు వందో, రెండొందలో ఉంటాయి. ఆక్వేరియంలో పెంచుకునే గోల్డ్ ఫిష్ లాంటి చేపలైతే కాస్త ఎక్కువ ధర ఉంటాయి. కానీ థాయ్ లాండ్ లో ఓ చేప 53,500 బాట్ (1,03,733 రూపాయల)ల ధర పలికి రికార్డు నెలకొల్పింది. ఈ చేప అంత ధర పలకడానికి కారణమేంటంటే...ఇది థాయ్ జాతీయ జెండా రంగులో ఉండడమే. గతంలో ఇలాంటి చేపలను ప్రాడక్ట్ చేసినా అవేవీ సత్ఫలితాలనివ్వలేదు. జాతీయ జెండా రంగుల్లో వచ్చినా అవి కచ్చితత్వాన్ని ఇవ్వలేదు. ఈ చేపమాత్రం పొందిగ్గా రంగులద్దినట్టు సమాన పరిమాణాల్లో ఎవరో పెయింట్ వేసినట్టు ఉంది. దీంతో సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా దీనిని నవంబర్‌ 6న 99 బాట్‌ లతో వేలానికి పెట్టగా నవంబర్‌ 8తో వేలం ముగిసింది. దీనిని ఉత్పత్తి చేసిన కచెన్‌ వొరాచాయ్‌ మాట్లాడుతూ, ఈ చేపకు ఇంత ధర వస్తుందని అస్సలు వూహించలేదని అన్నారు. వేలానికి పెట్టిన రెండో రోజే ఇది 10 వేల బాట్‌ లు పలికి, చివరకు 53,500 బాట్‌ లకు అమ్ముడుపోయిందని హర్షం వ్యక్తం చేశాడు.

More Telugu News