: బోసిపోయిన తిరుమల... ఏ మార్గం గుండా వెళ్లినా రెండు గంటల్లో దర్శనం పూర్తి

పెద్ద నోట్ల రద్దు తరువాత చిల్లర లేక తిరుమల గిరులు బోసిపోయాయి. ఏడు కొండలపై 500, 1000 రూపాయల నోట్లను స్వీకరించకపోవడం, చిన్న నోట్లు లేకుండా వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, భక్తుల రాక మందగించింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపకపోవడంతో నేడు ఏ మార్గం గుండా దర్శనానికి వెళ్లినా రెండు గంటల్లోనే దర్శనం పూర్తయి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాలినడకన వెళ్లినా, ఉచిత దర్శనానికి వెళ్లినా, రూ. 300 ప్రత్యేక టికెట్ పై వెళ్లినా త్వరగానే దర్శనం పూర్తవుతోంది. మరోవైపు సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో అలిపిరి టోల్ గేటు ఖాళీగా కనిపిస్తోంది. తిరుమలలో గదులు ఖాళీగా ఉన్నాయి. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అన్న వితరణ శాఖ, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంతాలు భక్తులు లేక బోసిపోగా, కొండపైకి రవాణా సేవలందించే బస్సులు భక్తుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన స్థితి నెలకొంది.

More Telugu News