: టెస్టుల్లో 3 వేల పరుగుల మైలు రాయిని దాటి ఔట్ అయిన మురళీ విజయ్

టీమిండియా టెస్టు జట్టులో కీలకమైన ఓపెనర్ గా ఎదిగిన మురళీ విజయ్ తన టెస్ట్ కెరీర్ లో 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ విసిరిన బంతిని కవర్ డ్రైవ్ తో బౌండరీకి తరలించడం ద్వారా మురళి ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 7 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే మరో నాలుగు బంతులకే అండర్సన్ బౌలింగ్ లోనే మురళి ఔట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ మీదుగా అండర్సన్ విసిరిన ఓ షార్ట్ డెలివరీ మురళి గ్లోవ్ కు తగిలి, గల్లీలో ఉన్న స్టోక్స్ చేతుల్లో పడింది. దీంతో, 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళి ఔటయ్యాడు. ఈ క్రమంలో, 22 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ, పుజారాలు చెరో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అండర్సన్, బ్రాడ్ లు చెరో వికెట్ తీశారు. టీమిండియా ప్రస్తుత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు.

More Telugu News