: పాక్ ఉగ్రదేశమే... ఒబామా తేలేని బిల్లుకు ఆమోదం పలకనున్న ట్రంప్!

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు తీసుకురాలేకపోయిన కీలక బిల్లును కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేనున్నారు. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించేలా తయారైన ఓ కాంగ్రెస్ బిల్లును ట్రంప్ అప్రూవ్ చేయనున్నారని ట్రంప్ సలహా సంఘంలోని సభ్యుడు, ప్రముఖ భారత సంతతి వ్యాపారవేత్త శలభ్ కుమార్ వెల్లడించారు. "అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కచ్చితంగా మంచి స్నేహబంధం ఉంటుంది. భారత్ - అమెరికా భాగస్వామ్యం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొత్త శిఖరాలకు చేరుతుంది" అని ఆయన అన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకుంటే అందుకు అమెరికా సహకరిస్తుందని, రెండు దేశాలూ తమకు ముఖ్యమేనన్నది ట్రంప్ అభిమతమని శలభ్ వెల్లడించారు. జనవరిలో ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలినాళ్లలో తీసుకునే కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటని వెల్లడించారు.

More Telugu News