: భారత సరిహద్దుల్లో యుద్ధ విమానాలు, ట్యాంకుల సత్తాను చూపిస్తున్న పాక్

భారత సరిహద్దుల్లో 'రాద్ ఉల్ బార్క్' పేరిట పాకిస్థాన్ సైన్యం, తన సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సైనిక విన్యాసాలను తిలకించేందుకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ లు కూడా హాజరయ్యారు. పంజాబ్ ప్రావిన్స్ లోని భవాల్ పూర్ లోని ఖైర్ పూర్, తమివాలి ప్రాంతాల్లో పాక్ తన ట్యాంకర్లు, యుద్ధ విమానాల సత్తాను ప్రదర్శిస్తోంది. కాగా, తమ ఆయుధ సంపత్తి నిర్వహణా పనితీరును పరీక్షించేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నామని పాక్ సైన్యం చెబుతున్నప్పటికీ, భారత్ ను రెచ్చగొట్టేందుకే ఈ విన్యాసాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నవాజ్ ప్రసంగిస్తూ, భారత్ దుందుడుకు చర్యలను ఓపికగా, తాము భరిస్తున్నామని, అంతమాత్రాన తమను చేతగాని వారిగా భావించవద్దని, ఇండియాకు సరైన బుద్ధి చెప్పగల సత్తా తమకుందని అన్నారు.

More Telugu News