: జంటనగరాల వాసులకు శుభవార్త.. అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఏటీఎంలు

పెద్దనోట్ల రద్దుతో కొత్త నోట్లు, చిన్న నోట్ల కోసం ఖాతాదారులు బ్యాంకులకు, ఏటీఎంలకు వెళుతున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా, ఖాతాదారులు నిరాశ పడుతున్న సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం హైదరాబాద్ లో మొబైల్ ఏటీఎం వాహనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ ఏటీఎంలను కోఠిలోని ఎస్ బీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్ లాంఛనంగా ప్రారంభించారు. జంట నగరాల్లోని కీలక ప్రాంతాల్లో మొబైల్ ఏటీఎంలు సేవలందించనున్నాయి.మొబైల్ ఏటీఎంలో స్వైపింగ్ మిషన్ తో పాటు ఒక వ్యక్తి వాహనంలో ఉంటాడు. వీటి ద్వారా రోజుకు రూ.2 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకు పనివేళల్లో మాత్రమే సేవలు అందించే ఈ మొబైల్ ఏటీఎంలు ఆదివారం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.

More Telugu News