: ప్రపంచమంతా నేరాలు పెరిగిపోతుంటే... అక్కడ మాత్రం జైళ్లు మూసేస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. దోషులతో, నిందితులతో జైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఖైదీలకు సరిపడా జైళ్లు లేక అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. కానీ, యూరోపియన్ దేశమైన నెదర్లాండ్స్ లో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది. ఖైదీలు లేక అక్కడి జైళ్లను మూసేస్తున్నారు. గత పదేళ్లలో నెదర్లాండ్స్ లో 19 జైళ్లు మూతపడ్డాయి. వచ్చే ఏడాది మరిన్ని జైళ్లను మూసివేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నెదర్లాండ్స్ లో ఖైదీలకు తక్కువ కాలం జైలు శిక్ష విధిస్తుంటారు. శిక్షా కాలంలో కూడా వారిని మంచిగా చూసుకుంటారు. వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి, జైలు నుంచి విడుదలయ్యాక వారు ఉద్యోగం సంపాదించేలా సహకరిస్తారు. డ్రగ్స్ కు అలవాటుపడ్డ వారిని... సక్రమ మార్గంలోకి తెచ్చేలా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, ఆర్థిక సాయం కూడా చేస్తారు. రకరకాల కార్యక్రమాలతో ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ఈ క్రమంలో, నెదర్లాండ్స్ లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

More Telugu News