: నేను నోటీసిచ్చాను... ఈ దారుణంపై చర్చ జరగాల్సిందే: కాంగ్రెస్ ఎంపీ ఆనందభాస్కర్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిస్థితులపై రాజ్యసభలో నోటీసిచ్చానని కాంగ్రెస్ నేత రాపోలు ఆనందభాస్కర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నోరకాలుగా పన్నులు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం బ్యాంకు డిపాజిట్లపై కూడా పన్ను విధిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కేంద్రం చెబుతున్న మాటలతోనే హైదరాబాదులో రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. 80 శాతం మంది సామాన్య ప్రజలు ఈ నోట్లను వినియోగిస్తున్నారని, పెద్దనోట్ల రద్దుతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారని ఆయన చెప్పారు. దీనిపై పార్లమెంటులో తీవ్రమైన చర్చ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News