: మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్యా బిర్లా గ్రూప్ నుంచి రూ.25 కోట్లు లంచంగా తీసుకున్నారు: కేజ్రీవాల్ ఆరోపణలు

గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు రూ.25 కోట్లు లంచం తీసుకున్నారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలపై ఢిల్లీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడారు. గుజరాత్ సీఎం గా ఉన్న సమయంలో ఆదిత్యా బిర్లా గ్రూప్ నుంచి మోదీ రూ.25 కోట్లు లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదిత్యా బిర్లా గ్రూప్ అప్పటి అధ్యక్షుడు శుబేందు అమితాబ్ పై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో శుబేందు లాప్ టాప్ లు, బ్లాక్ బెర్రీ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2012 నవంబర్ 16న గుజరాత్ సీఎం కు రూ.25 కోట్లు చెల్లించినట్లుగా ఆ ల్యాప్ టాప్ లో వివరాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. పేదలను దోచుకుని తన కార్పొరేట్ మిత్రులను కాపాడుతున్నారని, వ్యాపారవేత్తలు ఆయనకు ముడుపులు ఇస్తున్నారంటూ కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News