: నక్సల్స్ ఏరివేతలో మహిళా కమాండోలు ఎంతో ధైర్యం కనబరిచారు: జార్ఖండ్ సీఆర్పీఎఫ్ ఐజీ

నక్సల్స్ ఏరివేతలో మహిళా కమాండోలు ఎంతో ధైర్యం కనబరచారని జార్ఖండ్ సీఆర్పీఎఫ్ ఐజీ సంజయ్ ఎ.లత్కర్ తెలిపారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో మొట్టమొదటిసారిగా మహిళా సీఆర్పీఎఫ్ కమాండోలు పాల్గొన్నారన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఖూన్తిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంతో ధైర్య సాహసాలు కనబరచారన్నారు. సీఆర్పీఎఫ్ 232 బెటాలియన్ డెల్టా కంపెనీకి చెందిన 135 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. మహిళా కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. పురుషులతో సమానంగా కఠినమైన శిక్షణను వారికి ఇచ్చామని పేర్కొన్నారు.

More Telugu News