: కోహ్లీ కెరీర్ లో విశాఖ టెస్టు కీలకమైనది!

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ తో విశాఖపట్టణం వేదికగా ఆడనున్న రెండో టెస్టు కీలకమైనది. విశాఖ మ్యాచ్ తో కోహ్లీ తన కెరీర్ లో 50 టెస్టులు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో ఈ టెస్టు అతడికి ప్రత్యేకమైనది. అదే సమయంలో సఫారీలు ఆసీస్ ను చిత్తుచేసి పాయింట్ల పట్టికలో దూసుకొస్తున్నారు. పాకిస్థాన్ జట్టు నెంబర్ వన్ స్థానం సాధించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో విశాఖ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు అవసరం. అంతే కాకుండా ఇప్పటి వరకు 49 టెస్టుల్లో కోహ్లీ 84 ఇన్నింగ్సులు ఆడాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, 13 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 211 అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన కోహ్లీ మొత్తం టెస్టుల్లో ఆటగాడిగా 46.11 సగటు, కెప్టెన్ గా 55.17 సగటుతో 3,643 పరుగులు చేశాడు. నాలుగు వరుస సిరీస్ లు కెప్టెన్ గా విజయం సాధించాడు. దీంతో ఈ టెస్టు అతని కెరీర్ లో ప్రత్యేకంగా నిలవనుంది. బ్యాంటిగ్ కు స్వర్గధామమైన విశాఖలో ఓపిగ్గా ఆడితే భారీ స్కోరు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

More Telugu News