: నగదు మార్పిడి, భారీ మొత్తంలో జ‌రుగుతున్న‌ లావాదేవీలపై కమిటీ ఆరా తీస్తోంది: కేంద్ర హోంశాఖ

దేశంలో పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి, కొత్త‌నోట్ల‌ను చ‌లామ‌ణీలోకి తెస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం ఈ అంశంపై కొన‌సాగుతున్న ప‌రిణామాల గురించి స‌మ‌గ్రంగా వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ముగ్గురు సీనియర్ అధికారులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొంది. ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తోన్న ప్రత్యేక కమిటీ త‌మ‌కు నివేదిక ఇస్తోందని కేంద్ర హోం శాఖ ఈ రోజు మీడియాకు తెలిపింది. ప్ర‌ధానంగా ఖాతాదారుల‌ నగదు మార్పిడి తీరు, భారీ మొత్తంలో జ‌రుగుతున్న‌ లావాదేవీలపై స‌ద‌రు క‌మిటీ ఆరా తీస్తుంద‌ని పేర్కొంది. భార‌త‌ సరిహద్దు నుంచి దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి వివ‌రాలు తీసుకొని నివేదిక త‌యారు చేసి అందిస్తోంద‌ని పేర్కొంది.

More Telugu News