: ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారమవుతుందా?: అంబటి ప్రశ్న

కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ పద్మనాభంను అడ్డుకున్నంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అని అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముద్రగడను భౌతికంగా అంతం చేయాలనే ఉద్దేశంతోనే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేయడం మామూలేనని, కానీ ముద్రగడ అలా ఉద్యమం చేయడానికి వీల్లేదని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్లిద్దరూ చెప్పినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా? అని ఆయన ప్రశ్నించారు. ముద్రగడ నివాసం పక్కన ఉన్న చిన్న జిన్నింగు మిల్లును పోలీసులు ఆక్రమించుకుని మకాంపెట్టారని, ఇది సరైన విధానం కాదని, దానిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పాదయాత్రను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రమైన పరిణామలు చోటుచేసుకుంటాయని ఆయన హెచ్చరించారు.

More Telugu News