: 'పెద్దనోట్ల రద్దు'పై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పాఠకుడి స్పందన!

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు అంశం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం పాటించిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, జ‌నం రోడ్ల మీద ప‌డ్డారంటూ ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఈ రోజు చేసిన వ్యాఖ్య‌ల‌పై ap7am.com పాఠ‌కుడు రాజ్‌రెడ్డి స్పందించి, త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న పంపిన సందేశాన్ని య‌థాత‌థంగా ప్ర‌చురిస్తున్నాం.. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మూలాయం లాంటి రాజకీయ నాయకులారా.. ఎన్నడూ లేనిది సగటు జీవి పక్షాన నిలబడి గొంతెత్తడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు?.. అయినా మాకు కష్టాల్ని భరించడం అలవాటై పోయింది కదా.. * 70 ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో మాకు Q లో నిలబడడం కొత్తకాదు * రేషన్ కోసం * కరెంటు బిల్లు కోసం * కిరోసిన్ కోసం * నీళ్ల కోసం * విత్తనాల కోసం * ఎరువుల కోసం * స్కూల్ అడ్మిషన్ కోసం * బుక్స్ కోసం * సినిమా టికెట్స్ కోసం * రైలు టికెట్స్ కోసం * బస్సు పాస్ & టికెట్స్ కోసం * మున్సిపల్ టాక్స్ కట్టడం కోసం * ఇన్ కం టాక్స్ కట్టడం కోసం * హాస్పిటల్ ట్రీట్ మెంట్ కోసం * మెడిసిన్స్ కోసం * బర్త్ సర్టిఫికేట్ కోసం * డెత్ సర్టిఫికేట్ కోసం * ఆలయాల్లో దైవ దర్శనం కోసం * చివరకు మీలాంటి నాయకులకు ఓటు వేసింది కూడా Qలో నిలబడే.. కాబట్టి రేపటి బంగారు భారతం కోసం ఈ కష్టాన్ని ఇష్టంగానే భావిస్తున్నాం. ఇక్కడో సామెత చెప్పు కోవాలి... ‘కందకు లేని దురద కత్తి పీట కెందుకంట’... ..అంటూ పాఠకుడు రాజ్ రెడ్డి తన అభిప్రాయాన్ని మెయిల్ చేశారు.

More Telugu News